ఒక్క రోజులో గురక తగ్గాలంటే ఇలా చేయండి?

0
113

నిద్రలో గురుక పెట్టడం చాలా మందికి అలవాటు ఉంటుంది. దీనివల్ల ప్రశాంతంగా నిద్ర  రాదు. అలానే గురుక వల్ల  పక్క వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల ప్రశాంతంగా నిద్ర కూడా రాదు. ఈ సమస్య పురుషుల్లోనే వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ మహిళల్లో కూడా ఈ సమస్య వస్తుంటుంది.  అయితే ఈ గురక వల్ల గురక పెట్టే వారు బాగానే నిద్ర పోతారు కానీ అవతలి వారికి తెల్లవార్లూ జాగారమే అవుతుంది. అయితే బాగా వేగంగా గురక వస్తుంది అంటే రెస్పిరేటరీ సిస్టమ్ లో బ్లాకేజ్ ఏర్పడినట్టే.

అయితే ఎక్కువగా గురకతో బాధపడే వాళ్ళు చెక్ పెట్టాలంటే ఈ ఇంటి చిట్కాలను పాటిస్తేమంచి ఫలితం లభిస్తుంది. వీటిని ఫాలో అయ్యారంటే కచ్చితంగా గురక సమస్య నుండి బయట పడవచ్చు. వీటిని పాటించారంటే గురుక సమస్య తగ్గి ప్రశాంతంగా నిద్రపోవచ్చు.  అయితే మరి ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా గురక సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది తెలుసుకుందాం.

ఆలివ్ ఆయిల్

గురకతో బాధపడే వారికి ఆలివ్ ఆయిల్ కూడా బాగా సహాయపడుతుంది. రాత్రి నిద్రపోయే ముందు కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ని ముక్కులో వేసుకుంటే గురక సమస్య తగ్గుతుంది.

పసుపు

పసుపు తీసుకోవడం వల్ల గురక సమస్య నుండి బయట పడవచ్చు. పసుపు వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అలానే గురక సమస్యను కూడా ఇది తొలగిస్తుంది. రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలల్లో కొద్దిగా పసుపు వేసుకొని తీసుకోండి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీబయోటిక్ గుణాలు ఉంటాయి. రెగ్యులర్ గా దీనిని ఫాలో అయితే కచ్చితంగా గురక సమస్య నుండి బయట పడవచ్చు.

తేనే

తేనెని దాల్చిని పొడిలో వేసి ఈ రెండింటినీ ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో వేసుకుని తీసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల కూడా గురక సమస్య తగ్గుతుంది. అయితే రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని తాగండి. దీంతో గురక తగ్గుతుంది. అలానే కంఫర్ట్ గా ఉంటుంది.

పెప్పర్ మింట్

మీరు కొద్దిగా పుదీనా ఆకుల్ని మరిగించి తీసుకోండి లేదంటే ముక్కులో మింట్ ఆయిల్ ని వేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా గురక సమస్య తగ్గుతుంది.