కాఫీ అధికంగా తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

0
144

ఈ మధ్యకాలంలో కాఫీ ప్రియులు అధికంగా పెరిగిపోతున్నారు. చాలామంది కాఫీ తాగడానికి ఇష్టపడుతున్నారు. రోజుకు ఒక్కసారే కాకుండా నాలుగు, ఐదు సార్లు తాగుతున్నారు. కానీ ఇలా తాగడం వల్ల ఎన్నో దుష్ఫలితాలు వస్తాయి. కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో ఇప్పుడు చూద్దాం..

కాఫీ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదికాదని వైద్యులు సూచిస్తున్నారు. కాఫీలో అధికంగా తీసుకోవడం వల్ల కఫెస్టోల్‌ అనే రసాయన మూలకం కార‌ణంగా కొవ్వు పేరుకుపోతోంద‌ని తెలిపారు. దీంతో వారిలో రక్త ప్రసరణ సరిగ్గా‌ జరగకపోవ‌డంతో హృద్రోగాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాకుండా జ్ఞాపకశక్తి కూడా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. కాఫీ శరీరాన్ని డిహైడ్రేషన్ కు గురు చేస్తుంది. అంతేకాకుండా నోటి దుర్వాసన కూడా పెంచుతుందని తెలిపారు. కాఫీలు ఎక్కువగా తాగడం వలన, శరీరం లో వివిధ భాగాలతో పాటుగా నడుములో కూడా కొవ్వు పెరుకుపోతుంది. ఒక విధంగా ముఖంపై మొటిమల రావడానికి కూడా కారణం ఇదే.