వేసవిలో కూల్‌డ్రింక్స్‌ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

0
113

వేసవి వచ్చిందంటే చాలు..ప్రజలు చల్లటి పానీయాలు తాగడానికి మొగ్గుచూపుతుంటారు. ముఖ్యంగా మార్కెట్‌లో లభించే కూల్‌డ్రింక్స్‌ను అధికంగా తాగుతుంటారు. కానీ ఇవి తాగడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఎండాకాలంలో అయితే దాహం మరీ ఎక్కువగా ఉండడం వల్ల కూల్‌డ్రింక్‌లను తాగుతారు. కాని ఇలా తాగడం వల్ల మనం అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నవాళ్లం అవుతాం. ఎందుకో మీరే చుడండి..

కూల్‌డ్రింక్స్‌లో కేలరీలు,  చక్కెర శాతం అధికంగా ఉంటాయి. దీని వల్ల షుగర్, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలువచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కూల్‌డ్రింక్స్‌లో సోడా శాతం అధికంగా ఉంటుంది. దీనివల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై మళ్లీ ఆకలేయడం వల్ల ఎక్కువ ఆహారం తింటారు. దీంతో బరువు అధికంగా పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఈ కూల్ డ్రింక్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

కూల్‌డ్రింక్స్‌లో కెమికల్స్ అధికంగా వాడుతారు. అందువల్ల శరీరానికి హాని కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవి తాగడం వల్ల కాలేయం పై ప్రభావం చూపి..లివర్ సమస్యలను కలిగిస్తుంది. ఇంకా మధుమేహ సమస్యలు కూడా ఎదురవుతాయి. దంతాలపై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.