మంచి నీరు ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యకరం. చాలా మంది సెలబ్రిటీల కూడా తమ సౌందర్య, ఆరోగ్య రహస్యం మంచి నీళ్లేనని చాలా సందర్భాల్లో చెప్పారు. అందుకే ప్రతి రోజు మన శరీరానికి అవసరమైన నీటిని తాగుతుండాలి. కానీ కొందరు మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. పనిలో పడి నీళ్లను తాగరు. ఐతే నీళ్లు తక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు రోజుకూ 5 లీటర్ల నీరు తాగాలంటారు. నీళ్లు ఎక్కువగా తాగకపోతే డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. దానితో తొందరగా అలసటకు గురవుతుంటారు. ఎక్కువగా నీరు తాగేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారట. అయితే కొందరు రోజులో తక్కువగా నీరు తాగుతుంటారు. మరికొందరు మాత్రం భోజన సమయంలో మినహా. ఇక నీళ్లు అస్సలు ముట్టుకోరు.. నీళ్లు తాగని వారిలో డీహైడ్రేషన్ సమస్యతో పాటు నిద్రపై ప్రభావం చూపిస్తుందట. సరైన నిద్ర లేకపోవడానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్ అంటున్నారు నిపుణులు.
నీరు తక్కువగా తీసుకునేవారికి కండరాల తిమ్మిరికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సరైన నిద్ర ఉండదు. కొన్నిసార్లు రాత్రిళ్లు వ్యక్తి మేల్కోని ఉంటాడు. కండరాలలో దాదాపు 76 శాతం నీరు ఉంటుంది. అందుకే నీరు తక్కువగా తీసుకునేవారిలో కండరాల సమస్యలు మొదలవుతాయి. అలాగే కండరాలు తీవ్ర నొప్పి కలుగుతుంది.
కాళ్లు లాగడం పాదాలలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. దీంతో పాటు కండరాలు బిగుసుకుపోయినట్లుగా ఉంటుంది. దీంతో రాత్రంతా వారు నిద్రపోలేదు. నీరు తక్కువగా తాగేవారిలో మైగ్రేన్ సమస్య వస్తుంది. ఇది కూడా నిద్రపై ప్రభావం చూపిస్తుంది. డీహైడ్రేషన్ వలన నాలుక పొడిబారినట్లుగా ఉంటుంది. అలాగే వీరికి సరిగ్గా నిద్ర పట్టదు. అర్ధరాత్రిళ్లు నిద్రలేకుండా ఉంటారు.
“మంచినీళ్లు మరిన్ని తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి”.