చాయ్ అధికంగా తాగుతున్నారా? అయితే ఈ నిజాన్ని తెలుసుకోండి..

0
110

ప్రస్తుత రోజుల్లో చాయ్ అంటే ఇష్టం లేనివారు ఉండరు. మనం ఉదయం లేవగానే తాగాల్సిందే.. టీ తాగకుంటే వారికి ఏ పని తోచదు. మనకు తలనొప్పి వచ్చిన ఏ సమస్య వచ్చిన మనం మొదటగా చాయ్ తాగుతాం. అయితేకొంత మంది చాయ్ రోజుకు ఒక్కసారి కాదు మూడు నుంచి నాలుగు సార్లు తాగుతుంటారు. అయితే ఛాయ్ అధికంగా తీసుకోవడం వల్ల లావైపోతారు. అందుకు ప్రధాన కారణం టీలో కేలరీలు చాలా అధికంగా ఉండడం. ఈ విషయం తెలియక చాలా మంది రోజుకు రెండు, మూడు సార్లు తాగుతుంటారు. అయితే కొన్ని ముఖ్యమైన టిప్స్ పాటించడంతో మీరు బరువు పెరగకుండా ఉండొచ్చు.

చాలా మంది టీని పెట్టుకునేటప్పుడు కొద్దిగా అల్లం లేదా ఇలాచి వాడుతూ ఉంటారు. నిజానికి ఇలా చేయడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. అలానే ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కనుక టీని పెట్టుకునేటప్పుడు కొంచెం తులసి కానీ కానీ యాలకులు కానీ లవంగాలను కానీ వేసుకోండి. ఇలా చేయడం వల్ల దానిలో పోషక పదార్థాలు పెరుగుతాయి. అదే విధంగా మెటబాలిజంకి ఉపయోగ పడుతుంది. బరువుని అదుపులో ఉంచడానికి కూడా ఇది సహాయ పడుతుంది. ముఖ్యంగా లవంగాలు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.

బాగాలావై పోతున్నామని అనుకునే వాళ్లు క్యాలరీలను తగ్గించుకోవడానికి ఫ్యాట్ మిల్క్ కాకుండా చూసుకోండి. ఎక్కువ కొవ్వు ఉండే పాలని ఉపయోగించడం వల్ల లావైపోతారు. మీరు కావాలంటే ఓట్స్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ లేదా సోయా మిల్క్ వాడొచ్చు. అదే విధంగా క్రీమ్ ఉండే పాలకు దూరంగా ఉండటం మంచిది. ఇలా చేయడం వల్ల కూడా క్యాలరీలు తగ్గుతాయి. పైగా బరువు పెరిగి పోకుండా ఉండడానికి కూడా అవుతుంది.

చాయ్ మానలేక పోతున్నారా.. అయితే దానిలో ఉండే చక్కెర శాతాన్ని తగ్గించండి. వీలైతే పూర్తిగా చక్కెరను తగ్గించడం కూడా మంచిదే. కొద్దిగా చక్కెరను తగ్గిస్తే కేలరీలు కూడా తగ్గుతాయి. కావాలి అనుకుంటే మీరు చక్కెరని తగ్గించి అందులో బెల్లం కానీ తేనె కానీ వేసుకోండి. ఇలా చేయడం వల్ల తియ్యదనం వస్తుంది. అలాగే చక్కెర వల్ల కలిగే నష్టాల నుండి కూడా మీరు దూరంగా ఉండొచ్చు.