అన్నం తిన్న వెంటనే నీరు తాగుతున్నారా? అయితే మీకు ప్రమాదం పొంచివున్నట్టే..

0
147

సాధారణంగా అందరు అన్నం తిన్న వెంటనే నీరు తాగుతుంటారు. కానీ అలా తాగడం వల్ల అనేక ఏం జరుగుతుందో తెలిస్తే మళ్ళీ జీవితంలో అన్నం తిన్న వెంటనే నీరు తాగరు. ఇంతకీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారా? మరి ఆలస్యం ఎందుకు వెంటనే చూసేయండి..

భోజ‌నానికి ముందు లేదా భోజ‌నం చేసే స‌మ‌యంలో లేదా భోజ‌నం అనంత‌రం నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ క్రియ‌కు ఆటంకం కలుగుతుందని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడయింది. మనం తిన్న ఆహారం జీర్ణం కాకా జీర్ణసంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా టైప్ 2 డ‌యాబెటిస్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంటుంది.

ఇంకా కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.  అందుకే భోజ‌నానికి 30 నిమిషాల ముందు నీటిని తాగాల‌ని, భోజ‌నం అనంతరం 30 నిమిషాల త‌రువాత నీటిని తాగాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు తిన్న తరువాత గంట సేపు ఆగి నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.