బిస్కెట్లు ఎక్కువగా తింటున్నారా.? ఈ షాకింగ్ విషయాలు మీ కోసమే..

Do you eat a lot of biscuits? But beware Tasmat ..

0
99

పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా బిస్కెట్లను ఇష్టపడుతుంటారు. ఇక ఉద్యోగస్తులైతే.. బ్రేక్ సమయంలో టీలో ముంచుకుని బిస్కెట్లు తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తారు. ఇలా ప్రతీ రోజూ ఎవరొకరు బిస్కెట్ల రుచిని టేస్ట్ చేస్తూనే ఉంటారు. అయితే ఎక్కువ బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి హానికరం అని హాంగ్‌కాంగ్ పరిశోధకులు అంటున్నారు. 60 వేర్వేరు రకాల బిస్కెట్లపై వారు చేసిన తాజాగా అధ్యయనం పలు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు  తెలుసుకుందాం.

హాంగ్‌కాంగ్‌కు చెందిన పలువురు పరిశోధకులు తాజాగా 60 వేర్వేరు రకాల బిస్కెట్లపై ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్యాక్ చేసిన బిస్కెట్లలో గ్లైసిడోల్, యాక్రిలమైడ్ అనే రెండు రసాయనాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో పలు బిస్కెట్ ఫ్యాక్టరీలు వాటి మోతాదును ఎక్కువగా వినియోగిస్తుండటంతో క్యాన్సర్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

బిస్కెట్ తయారీదారులు గ్లైసిడోల్, అక్రిలామైడ్‌‌లను బిస్కెట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. అయితే వాటికంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ బెంచ్‌మార్క్ ప్రకారం ఒక కిలో బిస్కెట్ల కోసం యాక్రిలమైడ్‌ను 350 గ్రాముల పరిమితిలో వినియోగించాలి. ఇదే సేఫ్ లిమిట్ అని అంటారు. అయితే, రెగ్యులేటర్లు కనీసం నాలుగు బిస్కెట్ బ్రాండ్లు ఈ పరిమితిని మించినట్లుగా కనుగొన్నారు.

కాగా, బిస్కెట్లు అందరికీ అత్యంత ఇష్టమైన చిరుతిండి కావచ్చు. అయితే మాత్రం వాటిని మోతాదులోనే తినాలని అధికంగా తింటే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.