వేసవిలో ఐస్ క్రీమ్ అధికంగా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..

0
112

సాధారణంగా ఐస్ క్రీమ్ అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తుంటారు. ఇది చల్లగా ఉండడం వల్ల దీనిని తినడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతారు. కానీ బాగుందికదా అని అధికంగా తింటే అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతామంటున్నారు నిపుణులు. ఎందుకో మీరు కూడా చూడండి..

ఐస్ క్రీంలో చక్కెర, కేలరీలు, కొవ్వులు అధికంగా ఉండడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. కానీ ఊబకాయం, గుండె జబ్బుల సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కేలరీల శాతం అధికంగా ఉండడం వల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఐస్ క్రీం అతిగాతినడం వల్ల ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు అధికం అవుతాయి. అందుకే  అధిక రక్తపోటు, అధిక బరువు ఉన్నవారు తీసుకోవద్దని సూచిస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఐస్‌క్రీమ్‌లో షుగర్ అధికంగా ఉండడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి పెరిగే అవకాశం ఉంది.