ఉప్పు అధికంగా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..

0
114

ఈ మధ్యకాలంలో ఉప్పు ఎక్కువగా తినేవారి సంఖ్య అధికంగా పెరిగిపోతుంది. కానీ ఉప్పు అధికంగా తినడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఇది కేవలం రుచికి మాత్రమే బాగుటుందని..కానీ ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకో మీరు కూడా చుడండి..

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల బీపీ పెరుగుతుంది. అంతేకాకుండా ఉప్పు వల్ల కిడ్నీ సమస్యలు  కూడా తలెత్తుతాయి. ఇమ్యూన్ సిస్టమ్ కూడా బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు సమస్యలు కూడా వేధిస్తాయి. అందుకే మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిది.

అందుకే ఉప్పు వాడకం తగ్గించడానికి ఈ చిట్కాలు పాటించండి. వంట మొదట్లో ఉప్పు వేసే బదులు చివర్లో వేస్తే ఉప్పు తక్కువ తక్కువగా పడుతుంది. పసుపు, జీల కర్ర పొడి, మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర వంటివి ఉప్పు తగ్గిందన్న విషయం తెలియకుండా చేస్తాయి. ఉప్పు బదులుగా లెమన్ పౌడర్, ఆమ్‌చూర్ పౌడర్, వాము పొడి, మిరియాల పొడి వంటివి వాడుకోవచ్చు.