సొంపు తింటున్నారా ? అయితే ఇది తప్పక తెలుసుకోండి

Do you eat anise? However it must be known

0
87

భోజనం చేశాక చాలా మంది కిల్లి వేసుకుంటారు. మరికొందరు యాలకులు తింటారు ఇంకొందరు తులసి ఆకులు తింటారు. ఇలా చాలా మందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అయితే మరికొందరు సొంపు తింటారు. ఇది చాలా మంది ప్యాకెట్ల రూపంలో కూడా కొనుక్కొని ఎక్కడకైనా వెళ్లినా పాకెట్లో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే దానికి అంతలా అలవాటు పడుతున్నారు జనం. అనేక రకాల మసాలా ప్లేవర్స్ తో కూడా ఈ సొంపు అనేది మార్కెట్లోకి వచ్చింది.

అయితే సొంపు తింటే కలిగే ప్రయోజనాలు చూద్దాం. భోజనం చేసిన వెంటనే సోంపును తింటే దాంతో నోరు తాజాగా మారుతుంది. నోటిలో ఉండే బాక్టీరియా, ఇతర క్రిములు నశిస్తాయి.దంతాలు, చిగుళ్లు శుభ్రంగా ఉంటాయి. నోటి నుంచి దుర్వాసన రాదు. జీర్ణ సమస్యలు రావు, పేగులు శుభ్రం అవుతాయి.

అసిడిటీ, అజీర్ణం, గ్యాస్ మలబద్దక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి.సోంపులో ఏమి ఉంటాయి అనేది చూస్తే మాంగనీస్, జింక్, కాపర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, సెలీనియం, మెగ్నిషయం ఇలాంటివి ఉంటాయి. అయితే పిల్లలకు ఇది అలవాటు చేయవద్దు అంటున్నారు వైద్యులు 15 ఏళ్లు దాటిన వారు తింటే బెటర్అని నిపుణుల మాట