చాలా మంది రాత్రి పూట అన్నం తినకుండా బరువు తగ్గాలి ఫ్యాట్ పోవాలి ఊబకాయం ఉండకుండా చూసుకోవాలి అని చపాతిలు తినడం స్టార్ట్ చేశారు, అయితే ఎన్ని చపాతీలు తింటే మంచిది అనేది చాలా మందికి తెలియదు, ఇక కొందరు భోజనం కాకుండా 5 లేదా 6 చపాతీలు తింటున్నారు, దీని వల్ల మరింత డేంజర్ అంటున్నారు నిపుణులు.
చపాతీలలో ఎక్కువగా విటమిన్స్ ఐరన్ కాల్షియం ఫాస్పరస్ మెగ్నీషియం పొటాషియం లాంటివి ఉంటాయి. బరువు పెరగరు అలాగే ఊబకాయం కూడా రాదు, కాని ఒక విషయం తెలుసుకోవాలి.. ఆరు ఇంచుల చపాతీలో 71 క్యాలరీలు ఉంటాయి.. అంటే లంచ్ టైంలో మీరు 300 కేలరీలు తీసుకుంటారు అనుకుంటే రెండు చపాతీలు తినడం ద్వారా 140 కేలరీలు వస్తాయి.
సో దీని ప్రకారం రోజుకి మూడు లేదా నాలుగు చపాతీలు కంటే ఎక్కువ వద్దు అంటున్నారు వైద్యులు..
చపాతీల లో బట్టర్ ఆయిల్ వాడకూడదు. ఇక రోజూ ఎక్సర్ సైజ్ చేయాలి ..చపాతి తిన పండ్లు జ్యూస్ తాగడం చేయవద్దు, మజ్జిగ మాత్రమే తీసుకోవడం మంచిది.