గోధుమపిండి అతిగా వాడుతున్నారా – చపాతీ పూరి ఎక్కువగా తింటున్నారా ఇది చదవండి

Do you eat more chapati and puri ? Read this

0
115

మనలో చాలా మంది రైస్ కంటే గోధుమలు బెటర్ అని చపాతీ, పూరి ఇలా ఎక్కువగా తీసుకుంటారు. కొందరు అయితే రాత్రి అన్నం తినడం మానేసి చపాతీలు తింటున్నారు. ఇక రాత్రి భోజనం కంటే ఇలా చపాతీ అయితే మంచిది అని చెప్పేవారు ఉన్నారు. డయాబెటిస్ ఉన్నవారు అన్నం మానేసి చపాతి తింటుంటారు.

మీరు ఒకటి గుర్తు ఉంచుకోండి. అతిగా గోధుమపిండి తీసుకున్నా మన ఆరోగ్యానికి మంచిది కాదు. వైద్యులు కూడా ఇదే చెబుతున్నారు. ఇంకా మిల్లెట్స్ లాంటి ఫుడ్ తీసుకోవాలి. అంతేకాని రోజూ రైస్ కి బదులు గోధుమపిండి వాడకం పెరిగితే మరిన్ని సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా గోధుమల్లో గ్లూటెన్ ఉంటుంది. ఇది మనం అతిగా గోధుమపిండి తీసుకుంటే శరీరంలో కూడా అధికంగా చేరుతుంది. ఇది ఎక్కువగా శరీరంలోకి వెళితే కడుపునొప్పి జీర్ణం అవ్వకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే చపాతీ ఎక్కువగా తీసుకున్న వారు ఉదయం బలబద్దక సమస్య ఉంది అని ఆస్పత్రులకి వెళతారు. అందుకే గోధుమలను మనం ఆడించుకుని పిండి తయారు చేసుకొని వాడితే మంచిది. ప్రాసెస్ చేసిన పిండిలో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. మనం మిల్లు పట్టించిన గోధుమల్లో తక్కువ ఉంటుంది.