చికెన్ తో పాటు వీటిని తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..

Did you take these along with the chicken? Beware Tasmat ..

0
127

చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుండరు. చాలా మంది చికెన్ ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. చికెన్ తినడం వల్ల లాభాలు, నష్టాలూ చేకూరే అవకాశం ఉంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం పైన మనం దృష్టి సారించాల్సి ఉంటుంది. లేదంటే మనకు తెలియకుండానే మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అయితే చాలా మంది చికెన్ తినేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అలా చేయడం వల్ల లేని సమస్యలను  మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకే చికెన్ ని తినేటప్పుడు వీటిని అస్సలు తినకూడదు. అయితే మరి చికెన్ తో పాటు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదో, ఒకవేళ తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు చూద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు వెంటనే చూసేయండి.

పెరుగు:

పెరుగు తో చాలా రకాల ఐటమ్స్ మనం తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే చికెన్ తో పెరుగును తీసుకోవడం మంచిది కాదు. చికెన్ తినడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది. పెరుగు తీసుకోవడం వల్ల చల్లగా ఉంటుంది. ఒకేసారి చికెన్ మరియు పెరుగును తీసుకునేటప్పుడు వేడి మరియు చల్లదనం రెండు ఒకేసారి అందుతుంది. దీని వలన నెగటివ్ ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

పాలు:

పాలలో క్యాల్షియంఅధికంగా ఎక్కువగా ఉంటుంది. పాలతో పాటు మీరు చికెన్ తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే మనం విషం తీసుకున్నట్లే అర్ధం. కాబట్టి అసలు చికెన్ తో పాలను కూడా తీసుకోవద్దు.

చేపలు:

సాధారణంగా చికెన్, చేపలు ఇటువంటివన్నీ కూడా మనకి భోజనం లో పెడుతూ ఉంటారు. అయితే చికెన్ తీసుకునేటప్పుడు చేపలతో పాటు తినకూడదు. ఎందుకంటే చికెన్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. చేపలలో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చికెన్ మరియు చేపని ఒకేసారి తీసుకోవడం వల్ల శరీరంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రెండింటినీ కలిపి ఎప్పుడూ తీసుకోవద్దుఅని నిపుణులు చూచిస్తున్నారు.