అధికంగా ఉప్పు తింటున్నారా..? అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు

Do you eat too much salt? However these unhealthy issues are not to blame

0
110

మనం తినే ఆహారానికి రుచి రావాలంటే అందులో సరిపడ ఉప్పు పడాల్సిందే. లేకపోతే ఆహారం రుచించదు. తినడానికి మనసు ఒప్పదు. అయితే వంటలకు రుచిని తెచ్చే ఈ ఉప్పు మన ఆరోగ్యాలను మాత్రం తీవ్రంగా దెబ్బతిస్తుందని మీకు తెలుసా?

బీపీ, గుండె పోటులకు ప్రధాన కారణం ఉప్పేనని తెలిసినా..దానికి దూరంగా ఉండడానికి కొందరు ఆసక్తి చూపించరు. రుచి పేరుతో ఇష్టం వచ్చినట్లు ఉప్పును వాడుతుంటారు. ఇక చిప్స్‌ వంటి ప్యాకేజ్‌డ్‌ ఫుడ్స్‌లో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఉప్పు మోతాదుకు మించి తీసుకుంటే జరిగే నష్టాలు ఇవే..

విపరీతంగా ఉప్పును తీసుకుంటే కాలక్రమేణ నాలుకపై ఉండే రుచి కళికలు రుచిని ఆస్వాదించే గుణాన్ని కోల్పోతాయి. దీంతో ఆహార పదార్థాల రుచిని కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది. ఎలాంటి ఆహారం తీసుకున్నా రుచిగా అనిపించవు. ఆహారంలో ఉప్పును ఎక్కువగా వీసుకునే వారికి దాహం ఎక్కువగా ఉంటుంది. ఎన్ని నీళ్లు తాగినా నోరి తడారుతుంటుంది. కాబట్టి ఇలాంటి సమస్య కనిపిస్తే ఉప్పు మోతాదును తగ్గించాలి.

ఉప్పు అధికంగా తీసుకుంటే శరీరంలో నీటి శాతం కూడా తగ్గుతుంది. ఇది కాలక్రమేణా డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. దీంతో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

అధిక మొత్తంలో తీసుకునే ఉప్పు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్, మూత్రపిండాలు వ్యాధులకు దారి తీస్తుంది.

ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోన్న దాని ప్రకారం మనిషి రోజుకి కేవలం 2 గ్రాముల సోడియం తీసుకోవాలని సిఫారసు చేస్తుంది. అంటే రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తీసుకోకూడదన్నమాట. లేదు రుచి కోసమని తిన్నారంటే పైన తెలిపిన సమస్యలు తప్పవు.