పీరియడ్స్ సమయంలో పెరుగు తినొచ్చా? లేదా? అని సందేహపడుతున్నారా..

0
79

సాధారణంగా పెరుగు అంటే ఇష్టపడని వారుండరు. చాలామందిని ఏ సమస్య వేధించిన పెరుగు తీసుకోమని వైద్యులు సూచిస్తారు. కానీ అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో తీసుకోవాలా లేదా అని సందేహ పడుతుంటారు. కానీ ఇది ఎంతవరకు సురక్షితమో వైద్యులు ఏమంటున్నారో మీరే చూడండి.

పీరియడ్స్ సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు చేకురావని వైద్యులు చేబుతున్నారు. పెరుగు తీసుకోవడం ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు దూరమవుతాయి. ఎముకలను బలోపేతం చేయడంలో కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో పెరుగును సమర్థవంతంగా తీసుకోవచ్చు.

కానీ తాజా పెరుగును మాత్రమే తీసుకోవాలని నిపుణులు చేబుతున్నారు. పీరియడ్స్ సమయంలో స్త్రీలలో పోషకాల కొరత ఉంటుంది. అందుకే ఐరన్, కాల్షియం అధికంగా ఉన్న పదార్దాలు తీసుకోవాలి. కొవ్వు పదార్దాలు ఉన్న ఆహారం తగ్గిస్తే మంచిది. అంతేకాకుండా రాత్రి పూట పెరుగు తీసుకోకూడదు. దానివల్ల పిత్త, కపం వంటి సమస్యలు వస్తాయని  వైద్యులు చేబుతున్నారు.