వేసవిలో అల్లం తింటే వేడి చేస్తోందని మానేస్తున్నారా? ఒక్కసారి ఈ నిజాలు తెలుసుకోండి..

0
123

అల్లం ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి వంటింట్లో తప్పకుండా ఉండే పదార్థం అల్లం. అల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కానీ వేసవిలో చాలామంది వేడిని కలిగిస్తుందన్న కారణంతో దూరం పెడతారు.

అల్లం జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. ఉదయాన్నే అల్లం, నిమ్మరసం, తేనె కలిపి తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అల్లం వల్ల కలిగే వేడి మనకు చెమట పట్టేలా చేసి, శరీర ఉష్ణోగ్రతను సమంగా ఉంచుతుంది. కానీ వేసవిలో రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ అల్లాన్ని తినకూడదు.

రక్తస్రావం లేదా డయాబెటిస్‌తో బాధపడేవారు వేసవిలో అల్లం తీసుకోవడం మంచిది కాదు.  వేసవిలో క్రమం తప్పకుండా అల్లం టీ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి చర్మాన్ని రక్షణ లభిస్తుంది. వేసవిలో వచ్చే అజీర్ణం, ఉబ్బరం వంటి ఉదర సమస్యలను అరికడుతుంది.