చాలా మందికి ఓ అనుమానం ఉంటుంది… రోజూ మంచి నీరు ఎక్కువగా తాగుతున్నాం కదా దీని వల్ల మనం బరువు పెరుగుతామా అనే అనుమానం ఉంటుంది… అయితే అధిక బరువుకి నీరు ఎక్కువ తాగడానికి ఎలాంటి సంబంధం ఉండదు.. కేవలం నీళ్ళు తాగితే శరీరంలోని కొవ్వు, కేలరీలను కరిగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు… అయితే దీనికంటూ ప్రత్యేకంగా ఓ సమయం పెట్టుకోండి.. అదే పనిగా ఒకేసారి రెండు మూడు లీటర్లు నీరు తాగకూడదు.గ్లాసులతో నెమ్మదిగా నీరు తీసుకుంటే ప్రయోజనం కనిపిస్తుంది.. ఇలా తాగడం వల్ల మీకు ఎక్కువగా ఆహారం తీసుకోవాలి అనిపించదు, శరీరాల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.. ఇక భోజనం తర్వాత కంటే ముందు రెండు గ్లాసుల నీరు తాగితే మంచిది.మరో ముఖ్యమైన మాట నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కండరాలు బాగా పనిచేస్తాయి. అందువల్ల నీళ్లు ఎక్కువగా తాగుతూ వ్యాయామం చేస్తే మీకు చాలా మంచిది… అంతేకాదు బరువు సమస్య ఉన్నా తగ్గుతుంది. మీరు ఊబకాయంతో బాధపడుతున్నా బరువు తగ్గాలి అనుకుంటున్నా రోజుకి నాలుగు నుంచి ఆరు లీటర్ల నీరు తాగండి. ఇలా నిత్యం ఐదు లీటర్ల నీరు తాగితే ఎలాంటి సమస్యలు ఉండవు బరువు తగ్గుతారు.
ReplyForward
|