మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ చిట్కాలు ట్రై చేసి వదిలిచుకోండిలా..

0
104

గోళ్లు కొరకడం అనేది చెడ్డ అలవాటు. మనం టివి చూసేటప్పుడో, ఖాళీగా ఉన్న సమయంలో అనుకోకుండా గోళ్లు కోరుకుతుంటాం. అయితే గోళ్లు కొరకడం అనేది కొన్నిసార్లు ఆందోళన లేదా ఒత్తిడి వల్ల కూడా వస్తుంది. గోళ్లు కొరకడం చెడ్డ అలవాటే కాదు ఆరోగ్యానికి కూడా చాలా హానికరం. గోళ్లను కొరకడం వల్ల భయం, ఆత్రుత నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. ఏడీహెచ్‌డీ, డిప్రెసివ్ డిజార్డర్, ఓసీడీ, ఆందోళనలకు గురయ్యేవారు ఎక్కువగా గోళ్లను కొరుకుతారని నిపుణులు తెలుపుతున్నారు.

కానీ ఈ అలవాటు ఇలాగే కొనసాగితే మనం ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం తరచుగా గోళ్లను కొరికితే గోళ్ల చుట్టూ ఉన్న చర్మంలో నొప్పి వస్తుంది. గోళ్లు పెరిగే కణజాలం కూడా దెబ్బతింటుంది. గోళ్లు కొరికే అలవాటు వల్ల చేతుల మురికి పొట్ట లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అలవాటును వదిలించుకోవడానికి ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

గోళ్లు కొరికే అలవాటును నివారించడానికి గోళ్లపై నెయిల్‌పెయింట్‌ను వేసుకోవచ్చు. అప్పుడు మీరు గోళ్లని కొరికినప్పుడు దాని చెడు రుచి మిమ్మల్ని అలా చేయకుండా ఆపుతుంది

గోళ్లను కొరికే అలవాటు మానుకోవాలంటే ముందుగా చేయాల్సింది వాటిని కత్తిరించుకోవడం. గోళ్లు పొట్టిగా ఉండటం వల్ల కొరకడానికి వీలు కాదు. ఫలితంగా ఈ అలవాటు నుంచి బయటపడొచ్చు.

గోళ్లు కొరికితే అందరి ముందు చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకే మీరు మీ మనస్సుని మళ్లించండి. తద్వారా కొద్దిరోజుల్లోనే గోళ్లు కొరకడం మానేస్తారు.

ఈ సింపుల్ చిట్కాలు పాటించి గోళ్లు కొరకడం అనే చెడ్డ అలవాటు నుండి విముక్తి పొందండి.