చాలా మంది పెద్దవాళ్లు చిన్నవాళ్లు కూడా గోళ్లు కొరుక్కుంటారు…. అయితే కొందరికి ఇది అలవాటుగా ఉంటుంది, మరికొందరు తెలియకుండానే ఇలా గోళ్లు కొరుక్కుంటారు.గోళ్లు కొరకడం చెడు అలవాటు. అలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అసలు చేతి వేళ్లల్లో గోరుల్లో ఉండే మట్టి మన శరీరంలోకి వెళితే రోగాలకు మనం ఆహ్వానం పలికినట్టే.
అసలు ఇలా మనం ఎందుకు గోళ్లు కొరుకుతామో తెలుసా, ఇది చిన్నతనం నుంచి వచ్చే అలవాటు, అయితే చిన్నతనంలో పెద్దలు మాన్పిస్తే ఒకే లేదు అంటే ఇది బాగా అలవాటు అవుతుంది.. దీనిని ఒనికోఫాగియా అని వైద్య భాషలో అంటారు, అయితే ప్రధానంగా బోరింగ్ ఫీల్ అయినా కోపం వచ్చినా ఎక్కువగా ఇలా గోళ్లు కొరుకుతారు.
అయితే ఇలా గోళ్లు కొరుక్కోవడం వల్ల ఎలాంటి నష్టాలు అనేది చూద్దాం
శరీరానికి చేటు చేస్తుంది
చర్మ బాగా దెబ్బ తింటుంది
గోళ్ల చుట్టూ పుండ్లు ఏర్పడతాయి.
గోళ్లు రంగు మారుతూ ఉంటాయి మచ్చలు వస్తాయి
ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురి అవుతారు
గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకోవడం ద్వారా అమ్మాయిలు ఇలా వీటిని కొరక్కుండా ఆపుకోవచ్చు
ఒత్తిడి లేకుండా ఉంటే మానవచ్చు.