మీకు బలపాలు తినే అలవాటు ఉందా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే..

0
98

సాధారణంగా చిన్నపిల్లలు బలపాల సహాయంతో రాయడానికి ప్రయత్నిస్తారు. చిన్నపిల్లలు రాసే క్రమంలో కొంచెం కొంచెం వాటిని తింటుంటారు. కేవలం చిన్నపిల్లలే కాకుండా పెద్దలు కూడా వీటిని తినడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇంకా మరికొంతమంది వాటిని వాసన చూస్తే చాలు ఎగిరి గంతేస్తారు. కానీ ఇవి తినటం వల్ల చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి..

ఎక్కువగా బలపాలు తినటం వల్ల పళ్ళు పుచ్చిపోవడంతో పాటు అనేక దంతాల సమస్యలు వస్తాయి. అంతేకాకుండా నోటి నుండి చెడు దుర్వాసన రావడానికి  కూడా దారి తీస్తుంది. ఇంకా దంతాలు బలహీనపడటం,దంతాలకు రంద్రాలు పడటం వంటి దుష్ఫలితాలు కూడా చవి చూడవలసి వస్తుంది. కావున  అలవాటు ఉన్నవారు వెంటనే మానుకోవడం మంచిది.

దాంతో పాటు వివిధరకాల రకాల ఆరోగ్యసమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్రీలు వీటిని తినడం వల్ల నులిపురుగుల సమస్య పెరగడంతో పాటు బిడ్డ ఆరోగ్యానికి కూడా హాని కలిగే అవకాశం ఉంటుంది. వీటిని అధికంగా తినేవారిలో పోషకాహార లోపం కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ అలవాటు ఉన్నవారు వీలయినంత తొందరగా మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.