మీకు తలకింద దిండు పెట్టుకొని పడుకునే అలవాటు ఉందా? అయితే ఈ సమస్యలు వస్తాయట..

0
117

ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో ఒత్తిడి కారణంగా రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోయే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది.కానీ మనిషి ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. కానీ మనకు తెలియక చేసే తప్పుల వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కావున మనము నిద్ర విషయంలో వీలయినంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

ముఖ్యంగా చాలామంది పడుకునే ముందు తలకింద దిండు పెట్టుకుంటారు. కానీ ఇలా పెట్టుకోవడం అంటే మనం ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. మనం పడుకున్నప్పుడు మెడ పరుపుకు సమాంతరంగా ఉండడం వల్ల శరీరానికి ఎలాంటి హాని కలగదు. కానీ తల కింద దిండు పెట్టుకుంటే మెడ ఎత్తుగా అయినా ఉంటుంది, కిందకైనా ఉంటుంది. దీనివల్ల నెక్ పెయిన్ సమస్య వేదించే అవకాశం ఉంటుంది.

దాంతో పాటు బాక్ పెయిన్ రావడానికి కూడా ఒక విధంగా కారణం ఇదే. ఇంకా దిండు పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కావున ఈ అలవాటు ఉన్నవారు వీలయినంత తొందరగా మార్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. చక్కని నిద్ర కావాలంటే ఈ అలవాటును దూరం చేసుకోండి.