మీకు గురక పెట్టే అలవాటు ఉందా? నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనర్థాలు..

0
106

సాధారణంగా కొంతమందికి గురక పెట్టే అలవాటు ఉంటుంది. దీనివల్ల వారితో పాటు పక్కవారికి కూడా నిద్రపట్టక చిరాకుగా ఫీల్ అవుతారు. పడుకునేటప్పుడు పరిసరాలు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత చక్కగా నిద్రపడుతుంది. అందుకే గురక రావడానికి కారణాలు, గురక  సమస్యను తగ్గించే చిట్కాలు ఇప్పుడు చూద్దాం..

మనం గాలి తీసుకునేటప్పుడు ఏదైనా అడ్డంకి ఎదురైనప్పుడు..శ్వాసనాళాల్లో ఇబ్బందిగా మారినపుడు గురక వస్తుంది. కానీ గురక శబ్దం మోతాదుకు మించితే మాత్రం వెంటనే సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ అశ్రద్ధ చేస్తే..ముక్కులోని టర్బనైట్స్, గొంతులో ఉండే ట్రాన్సిల్స్, అడినాయిడ్స్​ లాంటి వాటి వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావచ్చు.

ముఖ్యంగా ఒబేసిటీ, కొవ్వు ఎక్కువగా ఉన్న వారిలో అధికంగా వస్తుంది. అందుకే వెల్లకిలా కానీ, బోర్లా కానీ పడుకున్నప్పుడే ఈ గురక ఎక్కువగా వస్తుంటుంది. అందుకే, పక్కకు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. గురక పెట్టే వ్యక్తులకు ధూమపానం అలవాటు ఉంటే, వెంటనే స్వస్తి చెప్పడం మంచిది.