సాధారణంగా ఏదైనా ఆహారపదార్దాలు తినేటప్పుడు చాలామంది తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది పని అడావుడిలో నిలబడి ఆహారం తింటుంటారు. కానీ అలా తినేవారికి ఈ సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఎందుకో మీరు కూడా ఓ లుక్కేయండి..
నిలబడి ఆహారం తినే క్రమంలో కంగారులో సరిగ్గా నమలకుండా త్వరగా తింటుంటాము. కానీ దానివల్ల ఆహారం పేగుల్లోకి వెళ్లి జీర్ణసంబంధిత సమస్యలు రావడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యల భారీన పడే అవకాశం అధికంగా ఉంటుంది. ఇంకా నిలబడి ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అందుకే నేలపై కూర్చొని తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చేబుతున్నారు. నేలపై కూర్చొని తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరిగి ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు నేలపై తినడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే నేలపై కూర్చున్నప్పుడు, నాడీ వ్యవస్థ స్థిరంగా ఉండి ఆహారంలోని పోషకాలు శరీరానికి నేరుగా లభించి పూర్తిగా జీర్ణమవుతాయి. దీనివల్ల బరువు పెరగడం నివారించబడుతుంది.