మీకు స్విమ్మింగ్ చేసే అలవాటు ఉందా? అయితే ఈ ప్రయోజనాలు పొందుతున్నట్టే..

0
123

ప్రస్తుతం వేసవికాలం కావడంతో విద్యార్థులు ఈతకు వెళ్లి అక్కడ ఆనందంగా సమయాన్ని గడుతుంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఈత కొట్టడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈత నేర్చుకోవడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా..కొన్ని అనుకోని సందర్భాలలో ప్రాణాలను కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది.

అందుకే ప్రతి ఒక్కరు వీలయినంత తొందరగా స్విమ్మింగ్ నేర్చుకోవడం మంచిది. ఒక్కసారి ఈత కొట్టడం వల్ల లాభాలు తెలిస్తే ప్రతి రోజు ఈత కొట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. శరీర వేడిని తగ్గించడంలో స్విమ్మింగ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్ర‌తి రోజు క‌నీసం పావు గంట పాటు స్విమ్ చేస్తే శరీరం చల్లబడుతుంది.

ఇంకా ముఖ్యంగా లావుగా ఉన్నవారికి స్విమ్మింగ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్ర‌తి రోజు కొంత స‌మ‌యం పాటు స్విమ్మింగ్ చేస్తే ఒత్తిడి, డిప్రెష‌న్‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు తగ్గి మంచిగా నిద్ర పడుతుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడడంతో పాటు..గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.