మనం ఆరోగ్యంగా ఉండడం కోసం మార్కెట్లో వివిధ రకాల మందులతో పాటు..అనేక రకాల చిట్కాలు పాటిస్తూ విశ్వప్రయత్నాలు చేస్తుంటాము. కానీ మనకున్న చేడు అలవాట్లను మాత్రం మనుకోలేకపోతాము. ముఖ్యంగా పురుషులు దూమపానం చేస్తూ తమ ఆరోగ్యాన్ని తామే చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. మీకు కూడా స్మోకింగ్ అలవాటు ఉందా? దానిని వదులుకోలేకపోతున్నారా? అయితే ఇలా చేసి చూడండి..
ధూమపానం మానేయలేకపోతే ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ఆహారాలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ రోజువారీ ఆహారంలోనారింజ, మోసంబి నిమ్మకాయలు, బటాబీ నిమ్మకాయలు మొదలైన పండ్లు ఉండేలా చూసుకుంటే ఈ అలవాటు ఉన్న కూడా ఆరోగ్యంగా జీవించవచ్చు. అంతేకాకుండా స్మోకింగ్ చేసే వారు అల్లం టీ తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎలాంటి హాని చేకూరదు.
ఈ అలవాటు ఉన్నవారికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దూమపానం చేయడం వల్ల డయాబెటిస్ కు దారితీయడంతో పాటు..కంటి ఆరోగ్యం కూడా దబ్బతింటుంది. దూమపానం చేయడం వల్ల కళ్ళు పొడిగా మారి అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఈ అలవాటు ఉంటే వీలయినంత తొందరగా మానుకోవడం మంచిది.