ప్రస్తుతం జీవనవిధానం పూర్తిగా మారిపోయింది. పోషకాహార లేమి, బయట ఫుడ్ తో లేని పోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని గుండె సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, ఇతర వ్యసనాలు దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
ఇతర కారణాలు:
మారిన ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ వంటివి తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. దీనితో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పని ఒత్తిడి, సరైన వ్యాయామం చేయకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు.
అలాగే కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. అయితే ఒకేచోట ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది.
జన్యు సంబంధమైన కారణాల వల్ల కూడా గుండె నాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది.