నందివర్థన పువ్వులు మీ ఇంట్లో ఉన్నాయా? అయితే ఈ సమస్యలకు వెంటనే చెక్..

0
135

ప్రకృతిలో ఉండే వివిధ ఔషధ మొక్కల చాలా లాభాలు చేకూరుతాయి. కలబంద, తులసి వంటి మొక్కల వల్ల కలిగే లాభాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ నందివర్థన పువ్వులు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు చాలామందికి తెలియదు. వీటి వల్ల కూడా ఎన్నో సమస్యలకు వెంటనే చెక్ పెట్టొచ్చు.

తెలంగాణాలో చాలామంది ఈ పువ్వులను దేవుని పూజకు వాడతారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే..క్యాన్సర్ చికిత్సలో నందివర్ధనం పువ్వులను అధికంగా వాడుతారు. అంతేకాకుండా వాటి ఆకులతో రక్తపోటు సమస్యను వెంటనే దూరం చేసుకోవచ్చు. కడుపునొప్పి, తీవ్రమైన విరేచనాలు అయినప్పుడు ఈ నందివర్ధనం పువ్వులను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

పంటినొప్పి సమస్య ఉన్నవారు ఈ మొక్క యొక్క వేర్లను నమలడం వల్ల వెంటనే చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా కంటి అలసటను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఇన్ని ఉపయోగాలు ఉన్న నందివర్థన చెట్లు ఇంట్లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.