ఎక్కువ సార్లు శృంగారంలో​ పాల్గొంటున్నారా?

0
80

ఆయుష్షు పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి అని ఎవరైనా అడిగితే మామూలుగా పొగ మానెయ్యాలి. రోజూ వ్యాయామం చేయాలి. కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండే ఆహారం తినాలి. రాత్రిపూట కంటి నిండా నిద్రపోవాలి. మద్యం అతిగా తాగొద్దు. మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో భావోద్వేగ సాన్నిహిత్యం కలిగుండాలి చెబుతాం. కానీ ఈ జాబితాకు శృంగారాన్నీ జోడించుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.

ఇది జీవనకాలాన్ని 20 ఏళ్ల వరకు పొడిగించొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరణించే ముప్పును సగానికి తగ్గించొచ్చనీ మరికొన్ని సూచిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. శృంగారమనేది భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధానికి సంకేతం. ఆత్మీయ సంబంధంతో మానసిక బలమూ ఇనుమడిస్తుంది. ఫలితంగా కుంగుబాటు, దిగులు దరిచేరవు. శృంగారం వ్యాయామంగానూ ఉపకరిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. తరచూ శృంగారంతో రోగనిరోధకశక్తి బలోపేతమవుతుంది.

వారానికి ఒకటి కన్నా తక్కువసార్లు శృంగారంలో పాల్గొనే వారితో పోలిస్తే వారానికి ఒకట్రెండుసార్లు శృంగారంలో పాల్గొనేవారి లాలాజలంలో ఇమ్యునోగ్లోబులిన్‌ ఏ (ఐజీఏ) మోతాదులు ఎక్కువగా ఉంటున్నట్టు వైక్స్‌ యూనివర్సిటీ అధ్యయనం ఒకటి పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఐజీఏ కీలక పాత్ర పోషిస్తుంది. మరి సహజంగా శృంగార జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవాలంటే వ్యాయామం వంటి వాటితో పాటు తిండి మీదా కాస్త శ్రద్ధ పెట్టాలి. సోయా, చేపల వంటివి సెక్స్‌ హార్మోన్ల మోతాదులు పెరిగేలా చేస్తాయి.