మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? అయితే ఈ వీటిని అస్సలు తినకండి

0
94
3D Illustration von menschlichen Nieren mit Querschnitt

ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద లేకుండా వేధిస్తున్న సమస్యల్లో కిడ్నీలో రాళ్లు ఒకటి. ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. ఈ చెడు ఆహారపు అలవాట్ల కారణంగా.. కిడ్నీలో, పిత్తాయశంలో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్రమైన కడుపు నొప్పితో అవస్థలు పడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కిడ్నీ, లివర్‌లో రాళ్లు ఏర్పడితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తినకూడదు? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వీటిని తినండి:

కిడ్నీ, లివర్‌లో రాళ్లు ఏర్పడి ఇబ్బందులు పడుతున్నట్లయితే.. నీరు ఎక్కువగా ఉండే పండ్లను తినండి. రాళ్లను తొలగించడానికి వైద్యులు ఎక్కువ నీరు త్రాగాలని సిఫార్సు చేస్తుంటారు. నీళ్లు తక్కువగా తాగే వారికి రాళ్ల సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి. కిడ్నీలో, లివర్‌లో రాళ్ల సమస్య తొలగించుకోవడానికి పుచ్చకాయ జ్యూస్, సీతాఫలం, కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. పుచ్చకాయ గింజలను మాత్రం అస్సలు తినవద్దు.

సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి రాళ్లను కరిగిస్తుందని, రాళ్ల సమస్యతో ఇబ్బందులు పడేవారు వీటినీ తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు వీటిలో ఉండే సిట్రిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే నారింజ, సీజనల్ పండ్లు, జామ, ద్రాక్షలను తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఈ పండ్లు రాళ్ల సమస్యను దూరం చేయడమే కాకుండా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.

కాల్షియం అధికంగా ఉండే పండ్లు: కివీ, నల్ల ద్రాక్ష, అత్తి పండ్ల వంటి కాల్షియం అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. కాల్షియం రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు.. కాల్షియం అధికంగా ఉండే ఇతర ఆహార పదార్థాలను కూడా తీసుకోవచ్చు.

వీటిని అస్సలు తినొద్దు..

చాలా సార్లు ప్రజలు కిడ్నీలో, లివర్‌లో రాళ్లు ఏర్పడి ఇబ్బందులు పడుతున్నప్పుడు అవగాహన లేకుండా ప్రతీ పండ్లను తింటారు. అయితే, రాళ్ల సమస్యతో బాధపడే వారు కొన్ని రకాల పండ్లను అస్సలు తినొద్దని చెబుతున్నారు వైద్య నిపుణులు. దానిమ్మ, బత్తాయి, మామాడి, డ్రై ఫ్రూట్స్ అస్సలు తినకూడదని సూచిస్తున్నారు. ఈ పండ్లను పొరపాటుగా తింటే.. రాళ్ల సమస్య పెరుగుతుందంటున్నారు.