మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఎన్నో ఆలయాలకు ఎంతో విశిష్టత ఉంది. అలాంటి ఆలయం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఉత్తర ప్రదేశ్ లోని కాశీ గంగానది ఒడ్డున ఉన్న
ప్రముఖ చారిత్రక నగరం. ఇక్కడ ఎన్నో ఆలయాలు ఉన్నాయి. నిత్యం ఆ శివయ్యని లక్షలాది మంది దర్శించుకుంటారు.
ఇక్కడ వారాహి ఆలయం త్రిపుర భైరవి ఘాట్లో ఉంది. ఇది ఎంతో ప్రాముఖ్యమైన ఆలయం.
ఈ ఆలయం చాలా విశిష్టత కలిగింది. ఉదయం 5 నుండి 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది.
ఇక్కడ దేవతకి సూర్యకిరణాలు తాకే సమయానికి పూజలు ముగించి ఆలయం మూసేస్తారు.
ఇక్కడ దేవత విగ్రహం నేలమాళిగలో కనిపిస్తుంది. అక్కడకు పూజారి మాత్రమే వెళతారు.
మరి భక్తులు అందరూ పైకప్పులోని రంధ్రం గుండా దేవతని చూసి దర్శనం చేసుకోవాలి.
ఈ ఆలయానికి సంబంధించి రెండు రంధ్రాలు ఉంటాయి. ఒకటి ముఖం దర్శనం చేసుకోవటానికి, మరొకటి పాదాలను దర్శించడానికి. ఇలా అమ్మవారిని దర్శించుకోవాలి వారాహిని శైవులు, వైష్ణవులు , శాక్తేయులు పూజిస్తారు.