మనలో చాలా మందికి చికెన్ అంటే ఇష్టం ఉంటుంది, అయితే నల్ల కోడి మాంసం అంటే కొందరికి తెలియదు, అయితే ఇది కూడా మన బాడీలో ఇమ్యూనిటీని పెంచే మాంసాహారం..
మామూలు ఫారం కోళ్ల కన్నా కడక్ నాథ్ కోడి మాంసం మంచి రోగ నిరోధక శక్తిని కలిగుందని చెపుతున్నారు.
అయితే ఇది తింటే చాలా మంచిది అంటున్నారు నిపుణులు, ఇమ్యునిటీ పవర్ బాగా పెరగడంతో పాటు ఫ్యాట్ కూడా శరీరానికి చేరదు అంటున్నారు, ఈ మధ్య ఈ కోళ్లని బాగా పెంచుతున్నారు..
మధ్యప్రదేశ్ స్వస్థలమైన ఈ నల్లకోడి మాంసం ఎన్నో పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.
నల్లకోడి మాంసంలో జీరో శాతం ఫాట్ ఉండడంతో బీపీ, షుగర్, కరోనా ఉన్నవారు కూడా ఆహారంగా తీసుకుంటున్నారు, అంతేకాదు ఈ నల్ల కోడి మాంసం ఎముకలు నల్లగా ఉంటాయి.
కేజీ ఆరు వందల నుంచి 700 వందల వరకు పలుకుతుంది. ఇప్పుడు ఇవి కొందరు కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు.