ఆషాఢం వస్తే కొన్ని విశిష్టపండుగలు ఉంటాయి. ముఖ్యంగా బోనాలు కూడా ఈ సమయంలో జరుగుతాయి. ఇక ఆడవారు కచ్చితంగా ఆషాడంలో ఈ గోరింటాకు పెట్టుకుంటారు. ఈ సమయంలో ఆరోగ్యంపై దృష్టిపెట్టి కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటారు. ఈ ఆషాడం వచ్చింది అంటే ప్రతి ఇంట్లో మునగాకు కూర మునగాకు తెలగపిండి, మునగాకు పప్పు ఇలా ఏదో ఒకటి చేస్తారు.
ముఖ్యంగా నైవేద్యాలు పెట్టిన సమయంలో ఇలా మునగాకు ఎక్కువగా వండుతూ ఉంటారు. అయితే ఆషాడం సమయంలో కచ్చితంగా ప్రతీ ఒక్కరు మునగాకు కూర, పప్పు, రసం ఏదో ఒకటి ఎందుకు తింటారు దీని వెనుక కారణం ఏమిటి అనేది చూస్తే . ముఖ్యంగా గోదావరి, ఉత్తరాంధ్రా ప్రాంతాల్లో వారు మునగాకుని ఎక్కువగా ఇష్టపడుతూ తింటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
మునగాకులో ఏ, సీ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా దీనిని వాడతారు. షుగర్ సమస్య తగ్గుతుంది. కొవ్వు సమస్యలు ఊబకాయ సమస్యలు ఉండవు.
రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ మునగ ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆషాడం వర్షాలతో ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుదల కోసం ఆషాడంలో మునగాకు కచ్చితంగా తీసుకుంటారు.