బీట్ రూట్..బ్యూటీ పెంచడంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?

0
77

బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చర్మానికి సౌందర్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. ఎండలో బయటకు వెళ్లే వారి చర్మ రక్షణకు బీట్ రూట్ బాగా పనిచేస్తుంది. దానితో ఎలా మన సమస్యలను తొలగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

రేండు చెంచాల బీట్ రూట్ రసం, చెంచా పాలు కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే మంచి రంగు వస్తుంది. కొంచెం బీట్ రూట్ రసం,ఒక స్పూన్ టమాటా రసం కలిపి ముఖానికి రాయాలి. 20నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.

ఇలా చేస్తే ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి. బీట్ రూట్ రసాన్ని కళ్లకింద రాసి వేళ్ళతో మర్దన చేయాలి. 10నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేస్తే నల్లటి వలయాలు తొందరగా మాయమవుతాయి. మేడ నల్లగా ఉంటే బీట్ రూట్ రసం అప్లై చేయాలి. దానిపైన ఐస్ ముక్కతో మర్దన చేసి 10నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇవి పాటించి సౌందర్యాన్ని మరింత పెంచుకోండి.