ప్రస్తుత ప్రపంచంలో యువతి యువకులు అందానికి ఎంతప్రధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు… అయితే వారికి అధిక బరువు సమస్య వేధిస్తోంది… నాజుగ్గా కనిపించడానికి ఎన్నో మందులు వాడుతున్నారు… కానీ వాటి వాడకం వల్ల శరీరానికి ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు…
ఈ క్రమంలో సహజసిద్దంగా బరువు తగ్గాలనే ఆలోనచ చాలా మందికి వచ్చింది… సాధారణంగా తెలుగు ప్రజలు బీరకాయను అప్పుడప్పుడు వినియోగిస్తుంటారు.. కానీ బీరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు…
బీరకాయ కేవలం బరువు తగ్గాడానికి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలకు బీర సంజీవనిగా పని చేస్తుంది… బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది… క్యాలరీలు తక్కువగా ఉంటాయి.. కొవ్వను సైతం సులభంగా తగ్గించే శక్తి బీరలో ఉంటుంది…శరీరంలో చక్కెర శాతాన్ని ఎక్కువ కాకుండా చేస్తుంది..