అరటి ఆకులో భోజనం చేస్తే ఎంత మంచిదో తెలుసా

Do you know how good it is to dine on a banana leaf

0
90

ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్, స్టీల్, పింగాణీ, పేపర్ ప్లేట్లలో భోజనాలు చేస్తున్నారు. బాగా ధనవంతులు వెండి పల్లాల్లో కూడా తింటున్నారు. అయితే మనం పాత రోజుల్లో చూసుకుంటే కేవలం ఇంట్లో అందరూ అరటి ఆకుల్లో ఈ విస్తర్లలో భోజనం చేసేవారు. ఇంటికి ఎవరైనా వచ్చినా విస్తర్లలో వడ్డన ఉండేది. కాని ఇప్పుడు అరటి ఆకులో అన్నం తినడం అనేది ఏదో పూజల సమయంలో వ్రతాలు సమయంలో మాత్రమే కనిపిస్తోంది.

అరిటాకులో భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా శరీరానికి అరటి ఆకు భోజనం చాలా మంచిది. ఇప్పటికీ కొన్ని హోటల్స్ ఈ అరటి ఆకులో భోజనం వడ్డిస్తున్నాయి. ఇందులో ఆహరం తింటే ఆకలి పెరుగుతుంది. గ్యాస్ సమస్యలు అసిడిటి కడుపు ఉబ్బరం ఇవన్నీ పోతాయి. ఇక కాలేయం కిడ్ని సంబంధ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి.

మనకి పాతకాలంలో ఈ ఆకు వేసి వేడి వేడి అన్నం వడ్డించేవారు. ఇలా చేయడం వల్ల ఆ వేడికి ఆకులోని పోషకాలు అన్నంలో కలుస్తాయి. ఇలా తింటే కఫ, వాతాలు లాంటి సమస్యలు తగ్గుతాయి. మంచి ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో వ్రతాల సమయంలోనే కాదు సాధారణ సమయాల్లో కూడా ఇలా అరటి ఆకులో భోజనం చేయండి. ఇప్పటి పిల్లలకు కూడా ఇలా తినడం నేర్పించండి.