చిరు ధాన్యాల్లో మనం ఎక్కువగా రాగులు జొన్నలు సజ్జలు ఇవి వింటాం. మనం వాటితో రకరకాల వంటలు చేసుకుంటాం. అయితే రుచిలో తియ్యగా ఉండే మరో చిరు ధాన్యం ఊదలు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి భారత్, పాకిస్థాన్ , నేపాల్ , జపాన్ , చైనా పర్వత ప్రాంతాలలో ఎక్కువగా పండుతాయి. ఉత్తరాఖండ్ లో మెజార్టీ ఈ పంట పండిస్తారు.
ఊదలతో చేసుకునే ఆహరం మంచి బలమైనది. సులభంగా జీర్ణం అవుతుంది. ఉపవాస దీక్ష చేసే సమయంలో ఊదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఇవి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. మలబద్దకం ఉండదు, అజీర్తి సమస్యలు అస్సలు ఉండవు. షుగర్ పేషెంట్లు కూడా వీటిని తీసుకోవచ్చు.
కాలేయం శుభ్రపర్చడానికి సహాయపడుతుంది. గుండెకు చాలా మంచిది క్యాన్సర్ వ్యాధి రాకుండా సాయంచేస్తుంది. ముఖ్యంగా కామెర్లను తగ్గించడానికి కామెర్లు వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. విష జర్వాలు రాకుండా ఇది కాపాడుతుంది. ఊదలను ఆహారంగా చేసుకోండి
అని ఇటీవల వైద్యులు కూడా తెలియచేస్తున్నారు.