రోజూ పెరుగు తినడం ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

0
84

ప్రస్తుత జీవనవిధానం పూర్తిగా మారిపోయింది. ఉరుకుపరుగుల జీవితంలో ఇష్టం ఉన్న వంటకాలను తినలేకపోవుతున్నాం. అయితే ప్రత్యేకంగా వండకుండా చేసుకునే ఆహారపదార్ధాలలో ఒకటి పెరుగు. దీనిని తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి పెరుగంటే ఎంత ఇష్టమో మరికొందరికి అంతే కష్టం కూడా. పెరుగు మాట తీస్తేనే వాంతులు చేసుకుంటారు. మరి పెరుగు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. కొంద‌రికి పెరుగుతో తిన‌నిదే భోజ‌నం చేసిన‌ట్టు ఉండ‌దు. కొంద‌రికి ఎన్ని ర‌కాల కూర‌లు, ప‌చ్చ‌ళ్లు ఉన్న‌ప్ప‌టికీ భోజ‌నంలో పెరుగు త‌ప్ప‌కుండా ఉండాల్సిందే. పెరుగులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, ప్రోటీన్స్ వంటి అన్ని ర‌కాల పోష‌కాలతోపాటు శ‌రీరానికి మేలు చేసే లాక్టో బెసిల్ల‌స్ వంటి బాక్టీరియాలు కూడా పెరుగులో ఉంటాయి. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

పెరుగుకు మ‌న శ‌రీరంలో జీవ‌క్రియల రేటును పెంచే శ‌క్తి ఉంది. దీనిని మూడు పూట‌లా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే కొవ్వు 60 శాతం వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. పెరుగు సౌంద‌ర్య సాధ‌నంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కూడా పెరుగు ఉప‌యోగ‌ప‌డుతుంది. పెరుగును తిన‌డం వ‌ల్ల పొట్ట‌లో, ప్రేగుల‌లో ఇన్ ఫెక్ష‌న్ లు రాకుండా ఉంటాయి. అసిడిటీతో బాధ‌ప‌డే వారు పాల‌ను తాగ‌డానికి బ‌దులుగా పెరుగును తిన‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. పిల్ల‌ల‌కు దీనిని ప్ర‌తిరోజూ ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల ఎక్కువ‌గా ఉంటుంది.