అమ్మాయిలు జడ వెనుక ఎంత అర్ధం ఉందో తెలుసా ?

స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారో తెలుసా

0
100

ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు జడ వేసుకోవడం లేదు. ఇప్పుడు అంతా జడ లేకుండా హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నారు. ఇది చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. అనేక రకాల కట్స్ తో ఇప్పుడు జుట్టు కట్ చేసుకుంటున్నారు. కాని పాత తరాలు అంటే మన అమ్మమ్మలు, తాతమ్మలు మన అమ్మలను చూస్తే వారు కచ్చితంగా జడ వేసుకునేవారు.

గతంలో జడగంటలు, చామంతిపువ్వు, పాపిటబిళ్ళ, చెంపసరాలు ఇవన్నీ ఉండేవి. కాని ఇప్పుడు ఇవేమీ లేవు. అసలు జుట్టు లేకుండా స్టైలిష్ కటింగ్ చేసుకుంటున్నారు. తల వెంట్రుకలను ఒక పద్ధతిలో అమర్చుకొనే పద్ధతిని జడ అంటారు.అయితే స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారో తెలుసా? ముఖ్యంగా జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారంటే?

ఎవరైనా రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్న పిల్ల అని అర్దం వ‌స్తుంది. ఇక మొత్తం ఒక జడగా వేసుకుంటే ఆమెకి వివాహం అయింది అని లెక్క. కొప్పు పెట్టుకుంటే ఆమెకి సంతానం ఉందని అర్దం. అంటే ఆమె ఇంటి బాధ్యత చూసుకుంటుందని, ఇంటి పనంతా చేసుకుంటుంద‌ని భావించేవారు. ఆ కొప్పులో అంత అర్ధం ఉంది. జడలో మూడు పాయలకు కొన్ని అర్దాలు ఉన్నాయి. ఆమె, భర్త, తన సంతానం ఇది ఆ మూడు పాయలకు అర్దం.