మనం పరిశ్రమల వల్ల , వాహనాల వల్ల ఎక్కువ కాలుష్యం అవుతుంది అని అనుకుంటాం. చాలా మంది ఇదే భావిస్తారు. కాని మీరు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. కొన్ని నెలలుగా ఈ వాతావరణ కాలుష్యం దాని కారకాలపై విస్తృత అధ్యయనాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ పరిశోధన బట్టీ పందుల వలన ఎక్కువగా వాతావరణ కాలుష్యం జరుగుతుందని తేల్చారు. అయితే పందుల వల్ల వాతావరణ కాలుష్యం ఏమిటా అని మీకు ఆలోచన వస్తోందా.
అడవి పందులు మట్టిని తవ్వడం ద్వారా ప్రతి ఏడాది మట్టిలోని 4.9 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాలిలో కలుస్తుందట. ఏకంగా 11 లక్షల కార్ల నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ ఈ పందుల వల్ల గాలిలో కలుస్తోంది.
క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయం, కాంటర్బరీ విశ్వవిద్యాలయం పరిశోధకుల నేతృత్వంలోని ఒక అంతర్జాతీయ బృందం ఐదు ఖండాలలో అడవి పందులు చేస్తున్న వాతావరణ నష్టాన్ని గుర్తించారు.
అడవి పందులు పొలాలలో నిత్యం ఆహారవేటలో భూమిని దున్నినట్లుగా చేయడం చూస్తాం, ఇలా చేయడం వల్ల భూమి పొరల్లో కార్బన్ డయాక్సైడ్ గాల్లో కలిసి వాతావరణ కాలుష్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త పాయింట్ ఇప్పటి వరకూ అసలు వినలేదు అంటున్నారు ఇది విన్న వారు.