రైలుకి బ్రేకులు ఎలా పడతాయో తెలుసా – మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Do you know how the brakes are applied to the train?

0
81

బైకులు కార్లు సైకిళ్లు వ్యాన్స్ ఇలా చూసుకుంటే అన్నింటికి బ్రేకులు ఎలా పడతాయో తెలిసిందే. మన చేతిలోనే ఉంటుంది వాటి కంట్రోల్. వెంట‌నే బ్రేకులు వేస్తాం. కానీ వేలాది మందితో ప్రయాణిస్తున్న రైళ్లకి బ్రేకులు ఎలా వేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా. ఎందుకంటే ట్రైన్ కి పదుల సంఖ్యలో బోగీలు ఉంటాయి మరి ఇంత పెద్ద ట్రైన్ కి బ్రేకులు ఎలా వేస్తారు? ఎలా ఇంజన్ నియంత్రణలోకి తీసుకువస్తారు అనేది తెలుసుకుందాం.

రైలు బ్రేకులు ఎల్లప్పుడూ ఆన్ లో ఉంటాయి. లోకో పైలట్లు రైలు నడుపుతున్నప్పుడు గాలి ఒత్తిడి ద్వారా చక్రాల నుంచి బ్రేక్లను తీసివేస్తారు. రైలు ఎప్పుడైనా ఆపాల్సి వస్తే వాటికి గాలి ఇవ్వడం మానేస్తారు. దీంతో బ్రేకులు పడతాయి. అందుకే రైలు ఆగితే ఇలా శబ్దాలు వస్తాయి.

లోకో పైలట్ ఇంజిన్లో ఉన్న డెడ్ మ్యాన్స్ లివర్ను క్రమంగా నొక్కాల్సి ఉంటుంది. డెడ్ మ్యాన్స్ లివర్ అనేది ఒక ప్రత్యేక పరికరం. ఇది డ్రైవర్ చురుకుగా ఉందని ఇంజిన్ కి సంకేతాలిస్తుంది. ఇలా ప్రతీ రెండు మూడు నిమిషాలకి ఓసారి నొక్కుతూ ఉండటం వల్ల డ్రైవర్ యాక్టీవ్ గా ఉన్నాడని ఇంజిన్ కు తెలుస్తుంది. దీనిని GPS కి కనెక్ట్ చేస్తారు.

రైలు కదులుతూ గ్రీన్ సిగ్నల్ దాటినప్పుడు ఆ డేటా అంతా రైల్వే సర్వర్ లో సేవ్ అవుతుంది. ఒక వేళ రెడ్ సిగ్నల్ ఉన్నా ఆ రైలు ముందుకువెళితే సర్వర్ లో అది సేవ్ అవుతుంది. వెంటనే సర్వర్ GPS అనుసంధానం అయి ఉంటుంది. దీంతో ఆటోమేటిక్ గా బ్రేక్ లు పడిపోతాయి. కొద్ది దూరం వెళ్లి రైలు ఆగిపోతుంది.