మనలో చాలా మంది ఐస్ క్రీమ్ అనగానే వనిల్లా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఈ వనిల్లా ఐస్ క్రీమ్ తింటారు. అసలు ఈ వనిల్లా అంటే ఏమిటి ఇది ఎక్కడ నుంచి వస్తుంది అని చాలా మందికి తెలియదు అది తెలుసుకుందాం.వనిల్లా అనేది పండించే మసాలా. మన దేశంలో కూడా ఇది పెరుగుతుంది తమిళనాడు, కేరళ కర్ణాటక రాష్ట్రాలలో పెరుగుతుంది.
ఎక్కువగా ప్రపoచంలో ఉత్పత్తి చూసుకుంటే తూర్పు మెక్సికో, గ్వాటెమాల, సెంట్రల్ అమెరికా, ఉగాండా, జమైకా ఇక్కడ ప్రధానంగా సాగు చేస్తారు.అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో వెనిలా ఒకటి అయితే ఇది అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. కిలోకు దాదాపు 30 నుంచి 40 వేల రూపాయలు హై క్వాలిటీది ఉంటుంది మార్కెట్లో 20 వేల నుంచి 40 వేల వరకూ వీటి ధర ఉంటుంది.
ఐస్ క్రీంలో వాడతారు అని చాలా మందికి తెలుసు.. యూరప్ లో ఎక్కువగా కేకులు, బేకరీ ఉత్పత్తులు, పానీయాల్లో కూడా వాడతారు, అంతేకాదు పలు రకాల స్ప్రేలు తయారు చేస్తారు. సౌందర్య ఉత్పత్తులలో వనిల్లా వాడతారు ఇది ఆరోగ్యానికి మంచిదే ఇది తింటే శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది .లివర్ మరియు కీళ్లకు కూడా మంచిది. నెలకి ఓసారి తీసకున్నా మంచిదే అంటున్నారు నిపుణులు.