మహాభారతం గురించి తెలిసిన వారికి శకుని పేరు పెద్దగా చెప్పక్కర్లేదు. ఈ మాట వింటే ఆ పాత్ర వెంటనే గుర్తు వస్తుంది. మరి ఆయనకు గుడి ఉంది అనే విషయం తెలుసా. ఆయన కోసం ఒక ఆలయం ఉంది. ఆయనకూ పూజలు జరుగుతున్నాయి. ఎక్కడో కాదు మన దేశంలోనే కౌరవుల తల్లికి స్వయానా సోదరుడు అయిన శకునిని కౌరవులు అందరూ ఫాలో అయ్యేవారు.
శకుని గాంధార యువరాజు. దుర్యోధనుడిలో అహంకారాన్ని పెంచడంలో శకుని పాత్ర కూడా ఉంది. శకుని పాచికల పవర్ కూడా తెలిసిందే. మాయమ్కొట్టు మలంచరువు మలనాద ఆలయం భారతదేశంలో అత్యంత విశిష్ట దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం కేరళలోని ఉంది. అయితే ఈ ఆలయం గర్భగుడిలో విగ్రహం ఉండదు.
కేవలం శకుని కూర్చున్న గ్రానైట్ ముక్క మాత్రమే ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ మాత్రమే కొడతారు. ఇక ఎలాంటి మొక్కులు ఇక్కడ తీర్చుకోరు. ఇక్కడ శకుని ధ్యానం చేసి తపస్సు చేసినట్లు కూడా చెప్పుకుంటారు. శకునిని ఇక్కడ తాను అనుకున్నది సాధించిన వ్యక్తిగా చూస్తారు అందుకే చాలా మంది వచ్చి ఈ ఆలయం దర్శిస్తారు.