వినాయకుడ్ని ఇంకా ఏఏ దేశాల్లో కొలుస్తారో తెలుసా

Do you know in which countries Vinayakudu is still devoting ?

0
64

దేశంలో వినాయక చవితి రోజున ఎంత పెద్ద ఎత్తున పూజలు సంబురాలు చేసుకుంటామో తెలిసిందే. భాద్రపద శుక్ల పక్ష చతుర్థి తిథిన వినాయకుని జన్మదినంగా హిందువులు జరుపుకుంటాం. అయితే మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చవితి పండుగ జరుపుకుంటారు. మరి ఆ దేశాలు ఏమిటి ఎక్కడ ఎలా జరుపుకుంటారు అనేది చూద్దాం.

1.శ్రీలంకలో గణేశుడి ప్రతిమలు ఉంటాయి. అక్కడ నాలుగు ఆయుధాలతో ఉన్న వినాయకుడి విగ్రహాలు ఉంటాయి.
2. ఆఫ్ఘనిస్తాన్లో మహా వినాయక అని పిలిచేవారు కాబూల్లోని దర్గా పిర్ రట్టన్ నాథ్లో కనిపిస్తాయి కొన్ని విగ్రహాలు.
3. చైనాలో కుంగ్-హ్సీన్ దగ్గర గణేషుడిని ఆరాదించేవారు. ఇప్పటికీ కొందరు అక్కడ పూజిస్తారు
4.జపాన్లో వినాయకుడిని పూజిస్తారు. అక్కడ విరిగిన దంతం, ముల్లంగి, గొడ్డలిని ధరించి ఉంటాడు.
5.దక్షిణ మయన్మార్లో కూడా గణేషుడిని కొలుస్తారు
6.థాయ్లాండ్లో గణేశుడిని హిందూ సోమ రాజవంశం కాలంలో కొలిచేవారు.
7.ఇండోనేషియా గణేశుడిని కొలుస్తారు
8.బోర్నియోలో కూడా గణేశుడిని కొలుస్తారు
9.కంబోడియా హిందూ దేవతలు దేవాలయాలతో నిండి ఉంది ఇక్కడ కొందరు గణపతిని కొలుస్తారు.