మట్టి పాత్రల్లో వంటల వల్ల ఎన్ని లాభాలో తెలుసా

Do you know the benefits of cooking in earthenware pots?

0
123

ఇప్పుడు అంటే వంటకి అనేక రకాల పాత్రలు వచ్చాయి కానీ మన పూర్వీకులు మాత్రం మట్టి పాత్రల్లోనే వంటలు వండుకునేవారు . మట్టి పాత్రలు లేదా కుండలు పెట్టి వాటిలో అన్నం, కూరలు వండుకునేవారు. ఇక గ్యాస్ అనేది అప్పట్లో బాగా జమీందారుల దగ్గర మాత్రమే ఉండేది.ఈరోజుల్లో అందరూ గ్యాస్ స్టవ్ వాడుతున్నారు లేదంటే ఎలక్ట్రిక్ స్టవ్ వాడుతున్నారు.

ఇక నెమ్మదిగా ఉడికించి వంట వండటం చేయాలి. కాని పని వేగంగా అవ్వాలి అని వేగంగా మంట పెట్టి ఉడికిస్తున్నాము. ఇప్పుడు అంతా స్టీల్ ఇత్తడి సీవండి ఇలాంటి మెటల్ పాత్రల్లో వంటలు చేస్తున్నాం. దీంతో అందాల్సిన పోషకాలు అందడం లేదు. అయితే మట్టి కుండల్లో వంట వలన చాలా లాభాలు ఉన్నాయి.

ముఖ్యంగా మట్టి కుండలో ఎక్కువ నూనెతో వండాల్సిన అవసరం ఉండదు. ఇక ఈ వంట రుచిగా ఉంటుంది. ఇక వీటిని చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. ఎలాంటి కెమికల్స్ దానికి ఉండకుండా కడగాలి. నాన్ స్టిక్, స్టీల్ పాత్రల కంటే ఈ మట్టి పాత్రలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
.