శుభ్రమైన ఆహారం శుభ్రమైన నీరు మంచి గాలి ఈ మూడు ఉంటే చాలు మీకు ఎలాంటి అనారోగ్యాలు రావు, ప్రశాంత జీవనం గడిపేవారు చాలా మంది ఈ జాగ్రత్తలు తీసుకుంటారు, అయితే మంచి నీటిని తాగితే ఎలాంటి అనారోగ్యాలు శరీర బాధలు ఉండవు, మీరు ఎక్కడకు వెళ్లినా గోరు వెచ్చిన నీరు తాగితే మీకు వాటర్ పడదు అనే సమస్య రాదు, నేరుగా ఆ నీరు తాగితే మాత్రం మీకు కాస్త సమస్యలు వస్తాయి, అందుకే గోరు వెచ్చని నీరు తాగండి.
అయితే ఉదయం వేడి నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఉదయమే కాదు రోజంతా ఇలా వేడి నీరు గోరు వెచ్చగా తాగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చూద్దాం, ఇలా ఉదయం వేడి నీరు తాగితే శరరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, బర్నింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది, కేలరీస్ ఖర్చు అవుతాయి, వెయిట్ లాస్ అనేది అవుతారు.
వెచ్చటి నీటిని తీసుకోవడం కిడ్నీలో టాక్సిన్స్ పేరుకుపోయే సమస్య తగ్గుతుంది. బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది.వార్మ్ వాటర్ లో జీరో కేలరీస్ ఉంటాయి. మీరు నెమ్మదిగా ఇలా వాటర్ అలవాటు చేసుకుంటే ఇక ఈ వేడి వాటర్ మాత్రమే తాగుతారు.
వెచ్చటి నీటిలో కాస్త ఉప్పు వేసి గార్గ్లింగ్ చేయడం ద్వారా కూడా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. వేడి నీరు తాగితే చుండ్రు సమస్య తగ్గుతుంది.