బ్రహ్మజెముడు పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా

Do you know the benefits of eating Brahma jemudu fruit?

0
3001
Brahmajemudu

బ్రహ్మజెముడు మొక్క ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉన్న మొక్క. దీనికి చాలా ముళ్లు ఉంటాయి. బ్రహ్మజెముడు నీటి ఎద్దడిని తట్టుకుని ఇసుక నేలల్లో పెరుగుతోంది. ఇక వీటిని చాలా మంది రైతులు తమ పంటకు గట్ల దగ్గర వేసుకుంటారు. ఎందుకంటే ముళ్లు ఉంటాయి కాబట్టి పొలం చుట్టు రక్షణగా కంచెగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మంచి వాణిజ్య పంటగా దేశంలో ఎంతో పేరు సంపాదించుకుంది.

ఎరుపు, గులాబి రంగులో ఉండే బ్రహ్మ జెముడు పండ్లలో మంచి పోషకాలున్నాయి. ఇందులో B12, A, C విటమిన్లు ఉన్నాయి. వీటి పండ్లతో జామ్స్, స్వాకష్, ఐస్ క్రీమ్స్, జ్యూస్, జెల్లీలు తయారు చేసుకోవచ్చు. చాలా కంపెనీలు వీటిని త‌యారు చేసి ప్రాసెస్ తో అమ్ముతున్నాయి. ఈ పండు గింజల నుంచి నూనె కూడా తీయవచ్చు. అమెరికన్లు ఈ పండ్లని బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకుంటారు.

ఈ పండులో కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి నివారణకు బ్రహ్మజెముడు పండ్లు ఉపయోగపడతాయి. కార్బొహైడ్రేడ్లు, విటమిన్లు, పీచుపదార్థాలు అధికంగా ఇందులో ఉన్నాయి. అయితే ఈ పండుని అప్పుడప్పుడూ అయినా తీసుకోండి అంటున్నారు నిపుణులు.