ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా ఫీవర్ ఉన్నా, ఒకవేళ గర్భిణీ అయినా ఇక నెలలు నిండి ప్రసవానికి సిద్దంగా ఉన్నా, ఇక పిల్లలు పుట్టిన తర్వాత బాలింతగా ఉన్నా ఇలా ఎప్పుడు అయినా వైద్యులు ఓ కూర తినమని చెబుతారు. అదే బీరకాయ కూర. ఈ వంటకం ఇష్టపడని వారు ఉండరు. పచ్చడి కూర వేపుడు ఇలా బీరకాయ అందరికి నచ్చుతుంది, ముఖ్యంగా వైద్యులు కూడా ఈ కూరగాయ చేసుకోమంటారు.
ఎందుకంటే అనేక పోషకాలు కలిగిన కూర ఇది. బీరకాయలలో విటమిన్లు, మినరల్స్, షుగర్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
బీరకాయల్లో చాలా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం, అజీర్ణ సమస్యల్ని తొలగిస్తుంది. ఎవరికి అయినా ఫైల్స్ మలబద్దకం ఉన్నా అందుకే ఈ కూర తినమంటారు.
వారానికి రెండుసార్లైనా బీరకాయను వండుకొని తినాలి. పొట్టలో ఉండే చెడు బ్యాక్టిరీయా అంతా బయటకు పంపుతుంది.
బీరకాయ తింటే కవల పిల్లలు పుడతారన్నది అపోహ మాత్రమే, కడుపుతో ఉన్న వారికి ఈ మాట చెబుతారు ఎందుకంటే ఇవి తింటారు అని. అయితే దీనికి కవల పిల్లలకు సంబంధం లేదు.