ఏదైనా చిన్న సమస్య వస్తే వెంటనే మందుల షాప్ దగ్గరకు వెళ్లి టాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటాము.. ఇది చిన్న పిల్లల నుంచి ముసలి వారు వరకు అందరు ఇదే చేస్తున్నారు… కానీ తమ తమ ఇంటి పెరళ్లు పరిసరాల్లో ఉండే మొక్కల్లో తమకు వచ్చే అనారోగ్య సమస్యలకు సరిష్కారం చూపుతాయని అంటున్నారు…
మన ఇంటి పెరట్లో ఎక్కువగా పెరిగే మునగ చెట్టు మహత్యం కూడా ఇంకా ఎవ్వరికి తెలియదు. తాజాగా మునుగ చెట్టుకు చెందిన 36 రకాల జన్యువులపై పరిశోధనలు చేశారు… మునుగ చెట్టుకు చెందినఅన్ని భాగాలు మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు పనికొస్తాయని చెబుతున్నారు…
క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా మునుగ చెట్టు భాగాలతో నయం చేయవచ్చని తేల్చారు నిపుణులు… మునగచెట్టు, పూలు, ఆకు, కాయల్లో ఐరన్ జింక్ మొగ్నిషియంలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు…