స్నానం చేసిన తర్వాత ఎంతో హుషారు ఉంటుంది, బాడీపై ఉన్న చెమట మురికి అంతా తొలిగి రిఫ్రెష్ అవుతారు, అయితే చాలా మంది చలి నీరు చేస్తారు కొందరు మాత్రం కచ్చితంగా వేడి నీరు స్నానం చేస్తారు, ఇంకొందరు గోరు వెచ్చగా చేస్తారు.
అయితే వేడినీరు కూడా స్నానం చేయడం వల్ల చాలా మంచిది, ఇక ఉదయం పూట కంటే రాత్రి పూట కూడా తలస్నానం చేస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు, రాత్రి వేడి నీటి స్నానం చేసి పడుకున్న వారికి త్వరగా నిద్ర పడుతుంది.
చాలా ఉత్తేజంగా ఉల్లాసంగా లేవగానే ఉంటారు, చెమట చాలా తక్కువ పడుతుంది.గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది…రాత్రి వేడి నీరు స్నానం చేయడం వల్ల మెలటోనిన్ అనే స్లీపింగ్ హార్మోన్‌ను ప్రేరేపించి గాఢ నిద్ర వచ్చేలా చేస్తుంది. కండరాలకు రిలీఫ్ వస్తుంది.
రక్తపోటును తగ్గించుకోవాలంటే రాత్రిపూట గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. గోరు వెచ్చని నీటిని స్నానం చేస్తే శరీరం రిఫ్రెష్ అవుతుంది అంతేకాదు ఉదయం త్వరగా మెలకువ వస్తుంది.