ఆవ నూనె మనకు సన్ ఫ్లవర్ పామాయిల్ నువ్వుల నూనె వేరుశనగ ఎలాగో ఇది కూడా అంతే.. అయితే చాలా మంది ఇది ధర ఎక్కువ అని వాడరు.. కాని ఇది చాలా మంచిది..ఉత్తరాది రాష్ట్రాల్లో వంటల్లో ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు..ఇన్ఫెక్షన్కు గురి కాకుండా ఆవనూనెతో మర్దన చేసేవారు పాతరోజుల్లో మన పెద్దలు… మరి వీటి వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
మనం వంటల్లో ఆవనూనె వాడితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఆకలి అనేది వేయదు…తియామిన్, ఫొలేట్, నైసిన్ వంటి విటమిన్లు ఆవనూనెలో పుష్కలంగా ఉంటాయి. అధిక బరువుతో ఎవరైనా బాధపడితే వారికి ఇది ఉపశమనం ఇస్తుంది.
మస్టర్డ్ ఆయిల్తో శరీరం మర్దనాచేస్తే కండరాలకు బలంగా మారుతాయి. రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది.
బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.. ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంతేకాదు చిన్న చిన్న జబ్బులు రాకుండా ఉంటాయి… పెదాలకు ఆవనూనె రాసుకొని పడుకుంటే పెదాలు పగుళ్లు ఏర్పడవు. చర్మానికిఈ నూనె రాసుకుంటే నిగారింపు వస్తుంది.